Home  »  TV News  »  Podharillu :చక్రి మాస్టర్ ప్లాన్ - వన్ సైడ్ లవ్ కి బ్రేకప్!

Updated : Aug 26, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  పొదరిల్లు Podharillu. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 189 లో.....చక్రి ఓ లవర్స్ జంటని ఆపి.. మీది టూ సైడ్ లవ్వా వన్ సైడ్ లవ్వా అని అడుగుతాడు. దానికి తేడా ఏంటన్నా అని ఆ కుర్రాడు అంటే, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చక్రి అంటాడు. ఆ అమ్మాయి.. వీడు ప్రేమించాడు కాబట్టి నేను ప్రేమించాల్సి వచ్చిందని అంటుంది. నా సుక్కు నన్ను వదిలి వెళ్లదని ఆ కుర్రాడు బిల్డప్ ఇస్తే.. రేయ్ నీ మీద ఇష్టం లేకే నీ వెంట పడ్డావని ఒప్పుకుంది, రేపు గొడవైతే వదిలేసిపోతుందని చక్రి వార్నింగ్ ఇస్తాడు. అంతలో ఆ అమ్మాయే.. నువ్వు గొడవ చేస్తే నేను ఎందుకు భరించాలని అనడంతో ఆ కుర్రాడికి నిజం అర్థమై, నా కళ్ళు తెరిపించావ్ అన్నా అని ఆ అమ్మాయికి బ్రేకప్ చెప్పేస్తాడు. ఇదంతా చూసిన మహా నవ్వితుంది. నన్ను చూసి కామెడీ చేస్తున్నారని చక్రి ఫీల్ అయిపోతాడు.

 

ఇంకో పక్క బస్టాండ్ లో కన్నా గాడి సీన్ నడుస్తుంది. ఇద్దరు అమ్మాయిలు కన్నాని చూసి ఫోటోలు తీస్తూ, నంబర్ అడగడానికి ట్రై చేస్తారు. అందులో ఒక అమ్మాయి నిజంగానే కన్నాని ఇష్టపడుతున్నట్టు సైలెంట్ గా చూస్తుంది. కానీ పక్కన ఉన్న ఫ్రెండ్ మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తూ కనుబొమ్మలు ఎగరేయడం, వెక్కిరించడం చేస్తుంది. కన్నా గాడు మాత్రం ఓవర్ యాక్షన్ చేసే అమ్మాయే తనను లవ్ చేస్తుందని తప్పుగా అనుకుంటాడు. నువ్వు వెళ్లి నంబర్ అడుగు అని ఒక‌ అమ్మాయి చెప్తుంది. మరో అమ్మాయి.‌ నాకు భయంగా ఉందని అంటుంది. చివరికి ఇద్దరూ భయంతో నంబర్ అడగకుండానే ఆటో ఎక్కి వెళ్ళిపోతారు. కన్నా కూడా అలాగే భయపడి నిలబడిపోతాడు. మరోవైపు శైలు కోపంగా షాప్ కి వచ్చి చోటు గాడితో ప్లేట్ తెప్పించి, దేవుడి బొమ్మ, పసుపు, తాడుతో పసుపు తాడు రెడీ చేసి.. ఈ తాడు నా మెడలో కట్టు అని కేశవ మీద ప్రెషర్ పెడుతుంది. నా ప్రాబ్లం నీకు తెలుసు కదా, నేను కట్టలేనని కేశవ అంటాడు. నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పినప్పటి నుంచి ఇంట్లో ఎన్ని తిట్లు తింటున్నానో తెలుసా, నీకు నా గురించి పట్టదా అని శైలు ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు ఎవరికీ తెలియకుండా కట్టు, మీ అన్నయ్య పెళ్లయ్యాక అందరి ముందు పెళ్లి చేసుకుందామని శైలు చెప్పినా..కుదరదని అంటాడు కేశవ. ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అంటాడు. ఇక్కడే ఉండి నిన్ను పట్టుకుని వేలాడుతానని అనుకుంటున్నావా అని శైలు కోపంగా వెళ్ళిపోతుంది. తాళి కట్టాల్సింది కదన్నా అని కన్నా అంటే.. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసని కేశవ అంటాడు.

 

ఇంట్లో ఉన్న మనీషాని భన్సీ తీసుకెళ్లడానికి వస్తాడు. మనీషా వెళ్లడానికి ఇష్టం లేనట్టు ఉంటుంది. పెద్ది, మహా వంట చేస్తుంటే.. మీరంతా నన్ను బాగా చూసుకున్నారు, తెలుగు నాకు అర్థమవుతుందని మనీషా చెప్తుంది. నువ్వు నాకు చెల్లి లాంటి దానివి అని మహా హగ్ చేసుకుంటుంది. కన్నా తెలుగులో బూతులు నేర్పాడని కంప్లైంట్ చేస్తూ, అందరి దగ్గర సరదాగా మాట్లాడి వెళ్ళిపోతుంది మనీషా. నారాయణ మాత్రం ఇక్కడే ఉండిపోమని అంటాడు. ఇంకో పక్క చక్రి, విక్కీ బాస్ బాగా రెడీ అవుతాడు, కారు ఉంది, డబ్బు ఉంది, మహా వాడికే పడుతుందేమో అని ఫీల్ అయ్యి కాలు కాలిన పిల్లిలా తిరుగుతుంటే, కన్నా వచ్చి కారణం తెలుసుకుని బట్టల మూట తెచ్చి "నువ్వు డోర్ మ్యాట్ లాంటి బురద రంగు షర్టులు వేసుకుంటావ్, విక్కీ ఇస్త్రీ బట్టలు వేసుకుంటాడు, ఇక నుంచి బ్రైట్ గా మెరువు" అని తిడతాడు. చివర్లో కన్నా బస్టాండ్ లో అమ్మాయిల సంగతి మహాకి చెప్తే, మహా "నేను కూడా వస్తా చూద్దాం" అంటుంది. అప్పుడే చక్రి కొత్త బ్రైట్ షర్ట్, కళ్లజోడుతో స్టైల్ గా రావడంతో మహా షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.